STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

మహతి

మహతి

1 min
5


1.

పూర్వ కవులకు సద్భక్తి పూర్వకముగ

వందనములంచు నీ కవివరులు మ్రొక్కి 

సాహితీ సేవ ఘనముగా సల్పుచుండి 

పుణ్యమూర్తులై నిలిచిరీ పుడమి యందు //


2.

ఘనమగు మహతీ సంస్థయె కవివరులకు 

మార్గదర్శిగ వరలగ మాన్యతనిడి 

తెలుగు భాషకు కళ్యాణ తిలకమద్ది 

సాహితీరంగమున కృషి సల్పుచుండె //


3.

జ్ఞాన బిక్షనొసంగెడి శారదాంబ 

దీవెనలనిడు చుండగా దివ్యమైన 

భాతితో వెలుగొందుచు భాషకొఱకు 

మహతి సంస్థ సత్కీర్తితో మహిని వెలుగు.//


Rate this content
Log in

Similar telugu poem from Classics