గోపబాల
గోపబాల
గోపబాల!(విరహం )
చక్కనైన గోపబాల!సాయమింత చేయువాడ!
మ్రొక్కుకొన్న వారికెపుడు పుణ్య ఫలము లొసగువాడ!
నాదు మొరను వినగలేవ? నాటకంబు చాలు శౌరి!
కాదు కూడదంచు నన్ను కష్టపెట్టకో!మురారి!
గిరిని మోసి యపుడు గొప్ప కీర్తి పొందినట్టివాడ!
పరుగుపెట్టి వచ్చియుంటి పలుకరించు ప్రేమతోడ!
రాసలీల లాడినావు!రమణి మమత నెఱుగలేవ?
వేసమింకచాలు స్వామి!వెలది నిపుడు కాంచరావ!//
