శ్రీనివాస
శ్రీనివాస
శ్రీనివాస!(భక్తి )
శ్రీనివాస!నీదు పాద సేవ చేసుకొందునయ్య!
గానలోల!నిన్ను తల్చ కలత తీరిపోవునయ్య!
కొండపైన లక్ష్మి తోడ కొల్వు తీరియున్న స్వామి!
గుండె నిండ నిల్పుకొంటి!కూర్మి చూపరావదేమి?
పుడమినేలు దైవమంచు పూజలెల్ల సల్పుదాన!
నెడము జేయకయ్య! దేవ!యెఱుక కల్గి మెల్గు దాన!
కరుణ కల్గు నవ్వు చిల్కి కరము పట్టి నడువరాద!
శరణమంటి మాధవా!ప్రశాంత చిత్తమీయరాద!//
