STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
3

'హరీ!'శతకపద్యములు.


81.

ఉత్పలమాల.


పోరులఁ గెల్చి ధారుణిని పొందిరి సౌఖ్యము రాజులెందరో!

వారల కేమి దక్కె? పరివారము తోడ నశించి పోయిరే!

సారెకు నిన్ను దల్చి మనసారగ మ్రొక్కిన ముక్తసంగులై

చేరరె భక్తులెల్లరును శీఘ్రమె నీపద సన్నిధిన్ హరీ!//


82.

చంపకమాల.


తిమిరపు భూతమున్ దఱిమి తీర్చగ భక్తుల కష్టనష్టముల్ 

కమలను దోడ్కొనీ భువికి గ్రక్కున రావయ!దివ్యతేజ!మా 

భ్రమలను కాల్చువాడ!బహు బాధలఁ గ్రుంగెడి యీ జనంబుపై 

మమతను జూపరావ!!పరమాత్మ!దయాకర!పాహి!శ్రీహరీ!//


Rate this content
Log in

Similar telugu poem from Classics