STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

అమ్మ

అమ్మ

1 min
1

అమ్మ హృదిలోన దరగని 

యమృత ధార

జీవనదివోలె శిశువుకు జేవ నిడును 

తల్లి ఋణమునుదీర్చుట ధర్మమనుచు

దల్చు కొనవలె ధరణిలో దనయులెపుడు.

తల్లి యొడి లోని సౌఖ్యము దలచి చూడ

గాన రాదిల గొండంత కనకమున్న

దారతమ్యము లెంచని తల్లి ప్రేమ

ధనము బోసిన దొరకదు ధరణి యందు.

 విలువలన్నియు దెలుపుచు బెద్ద జేసి 

మంచి బుద్ధిని నేర్పుచు మమత బంచి

బదులు గోరక తల్లియె భవితనిడును

తల్లి కన్నను మించిన దైవమేది?.

సకల విశ్వము నందున సాగలేక

దైవ మిచ్చెను తనరూపు దల్లి యనుచు

దైవ దూషణ చేసెడి దనుజులైన

దల్లినెప్పుడు పూజించి తనరు చుంద్రు.

 క్షమకు నోర్పుకు గరుణకు శాంతికిలను

శాశ్వతంబుగ నిఱవగు స్థాన మెద్ది?

తల్లి యందీగుణంబులు వెల్లి విరియు

జగతి నేలు తల్లులకిదే జయము జయము.


Rate this content
Log in

Similar telugu poem from Classics