STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Children

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Children

సెల్లు లొల్లి

సెల్లు లొల్లి

1 min
340


శీర్షిక: సెల్లు లొల్లి 

**********************

వేకువ జామున లేచి

అరచేతిని చూసి ఎన్నాళ్ళయిందో కదా

కోడికూత నుండి కునుకు తీసేదాక

సెల్లు కబుర్లు సొల్లు మాటలు

అరక్షణం కూడా వీడక

అనుక్షణం కూడా వెంటేసుకుని

సమస్త జగత్తు 

సర్వం చిత్తు అనేలా

ఇంటింటి రామాయణంలా

మారిన చరవాణి చెర నుండి వీడేదెలా

పెద్దల మాటనే చద్ది మూటగా

భావించే భావి తరం వినేదెలా

పెద్దరికం పేదరికం చూడక

ముందు వెనకా కానక

ముందు వరుసలో నుంచుని

భవిష్యత్తును మరిపించి మురిపించిన

సెల్లు ను

అవసరం మేరకే వినియోగిద్దాం

ఆదర్శంగా మనమే బతికేద్దాం


Rate this content
Log in

Similar telugu poem from Abstract