తానో కృష్ణబిలం
తానో కృష్ణబిలం
చిక్కటి చీకటి ఆకాశంలో మెరిసే తారకల
అల్లిక జిగిబిగిని రచించే కవి ఎవరో గాని
నల్లని బల్లపై తెల్లని సుద్ద ముక్కతో
వజ్రపు తునకలను కళాత్మకంగా అల్లేది.
మేధోమథనంలో ఆరితేరిన గురువర్యులే!
విద్యాలయంలో ఎత్తైన గోడపైనో,
అరుగుపైనో సగర్వంగా ఆసీనురాలై
ఎన్నో అక్షరాలను, ఎన్నో పాఠ్యాంశ
చిత్రవిచిత్రాలను,ఎన్నో అంకెలను,
గణాంకాలను భావాలను,సిద్ధాంతాలను
తన మేనుపై నాట్యమాడిస్తుంది !
నిరంతరంగాఎందరి మనసులను
అలరించి,ఎంత మంది మేధావులకు
పదునుపెడుతుందో ఓ నాజూకైన
తెల్లటి సుద్దముక్కతో!
అలుపు సలుపెరుగదు,విసుగసలే లేదు
రోజుల తరబడి విజ్ఞాన భాండాగారాలను
అందిస్తున్నా ఓ నిశబ్ద నిమిత్తమాత్రురాలే!
విభిన్న మేధావుల చేతుల్లో కదలాడే
అక్షర మంత్ర దండమే!
నిత్య అక్షయపాత్రయే!
బాలలకైనా,యుక్తవయస్కులకైనా,
వృద్దులకైనా అందరికీ తాను
బహు ప్రీతిపాత్రమే!
నల్లని మేనిఛాయ అని ఎవరూ
మూతి ముడవరు,తెల్లని ముత్యాల్లాంటి
భావాలపైనే అందరి తదేకమైన చూపు,
కాలం మారినా,మరో డిజిటల్ యుగం
వచ్చినా లేరెవ్వరు తనకు సాటి,
రారెవ్వరు తనకు పోటీ!
తానో కృష్ణబిలం తెల్లని ముత్యాల్లాంటి
భావాల గుట్టు విప్పుతూ మెప్పును పొందుతూ,
తనకే తెలియదు తన మేనుపై ఎందరెందరో
అద్భుత ఆవిష్కరణలు పండిస్తున్నారని,
తనకు తెలియదు తాను నాగరికతా ప్రపంచానికి
విశిష్ట మేధోకళా ప్రాణవాయు యంత్రానన
