ఐక్యం
ఐక్యం
యవ్వనములో ఒకరిని ఒకరు ఆకర్షించుకుంటూ...
అందమనే మాయని జూచి మోహింపబడి...
సరసాలే సర్వస్వమని సర్దుబాటులో పయనమయ్యి...
గౌరవార్ధం దంపతులై క్రొత్త దారిలో అడుగులు వేసి...
మనువు మరచి అహంకార కోరల్లో చిక్కుకునే జంటలు...
పడక సుఖమే కాక పురిటి వ్యధిని సమానంగా అనుభవించే పతులు...
ఆనందములోనే గాక ఆందోళనలోనూ తోడునీడయ్యే పడతులు..
ఒకరికొకరు ఒకరిలో ఒకరు మమేకమైతే...
అర్థం చేసుకోవటం మాత్రమే కాదు...
ఆజన్మాంతం అన్యోన్యయంగా ఒకరికై ఒకరు దాసోహమయితే...
మరణం దాకా ఏ ఒకరు తోడు వస్తారో లేదోగాని...
జీవం ఉన్నంతకాలం జీవితాన్ని అందమైన జ్ఞాపకముగా మలిచితే...
అగ్నిహోత్రమ్ము సాక్షిగా చిరునవ్వుతో ఐక్యముగావచ్చు ...
