కుటుంబ అర్ధం - పరమార్థం
కుటుంబ అర్ధం - పరమార్థం
మమతల పూదోట కదా అలనాటి ఉమ్మడికుటుంబం,
తాత తండ్రి బామ్మ అమ్మా
అన్నా అక్కా చెల్లి తమ్ముళ్ల పరిమళ ఊసు కదా ఉమ్మడికుటుంబం,
వంశకీర్తిని చాటిచెప్పు
నడతల వారధి కదా ఉమ్మడికుటుంబం.
మనసున ప్రేమలు తరిగిపోతే మాయమయ్యే ఉమ్మడికుటుంబం,
మమకారం ఎరుగని చిన్నకుటుంబంగా మారిపోయే ఉమ్మడికుటుంబం,
కానరాని అనుబంధంలో పరుగులు తీయు జీవితమే కదా ఘనం,
అంగడిలోని వస్తువుయ్యే
ప్రేమాపాశపు అభిమానం.
నవ్య నాగరిక జీవనశైలి
తనలోకం తనదేనని చెబుతుంటే ఏమైపోతుంది
పరితపించు కుటుంబహృదయం,
ప్రియమైన స్వేచ్చే విషమైపోతే
మార్పన్నది ఎలా సాధ్యం,
ఉప్పెనలా ముంచేసే అహంకారం చూస్తుందా
రేపటి వాస్తవప్రపంచం,
తీపికలల సామ్రాజ్యంలో
మదినేలే సంతోషాలే
వెలతిగా వుంటే
జీవితంలో సాధించినది అయిపోదా స్వల్పం,
చెలిమికలిమిల
చిరునవ్వుల కోవెలలో
దైవరూపమై వుండేదేగా అనురాగం.
మౌనమైన హృదయానికి
వినిపిస్తుందా కనురెప్పల మనసురాగం,
నవ్వులవిందుల కుటుంబం
ఊహలా మిగలకుంటేనే
జాతికి క్షేమం.
