విశ్వశాంతి
విశ్వశాంతి
విశ్వశాంతి వీణియనే..పలికించే దేశమిదే..!
భరతవేద నాదమునే..శ్వాసించే దేశమిదే..!
నేలతల్లి హర్షించగ..చమటోడ్చే మునులెందరొ..
కిసానులను దైవాలుగ..సేవించే దేశమిదే..!
సరిహద్దుల రక్షణలో..నిదురెరుగని తరులెందరొ..
జవానులను రుద్రులుగా..పూజించే దేశమిదే..!
సాంకేతిక నైపుణ్యం..వృద్ధిచేయు రుషులెందరొ..
ప్రతిభాశాలుర కృషినే..గుర్తించే దేశమిదే..!
కూలీలో శ్రామికులో..ఉద్యోగులొ కార్మికులో..
సమభావం గౌరవముగ..ప్రకటించే దేశమిదే..!
అభిమానం ఆత్మీయత..అపురూపత నిధులెన్నో..
స్నేహపూర్ణ హృదయంతో..వర్షించే దేశమిదే..!
