నా దేశం
నా దేశం
చెరగని నవ్వుల భారతమా తరగని సిరులే నీ వశమా . . . !
మమతను పంచే మందిరమా..!
మానవతకు మరు చిరునామా ! !
నీ బిడ్డలే నిన్ను కాదన్నా...!
నిన్ను ఒంటరిని చేసి వలస వెళ్ళినా ...!
పాలు తాగి ఆ తల్లి(నీ) రొమ్మునే పాల పంటితో గాయపరిచినా..,
మమత పంచి నువ్వు పెంచిన బిడ్డలే మరల నీలోన కలిసి పోయినా..!
దేశ భక్తితో నిన్ను కొలిచినా ...!
దుష్ట బుధ్ధితో నిన్ను చెరిచినా ...!
నిన్ను కాచు నీ కన్న బిడ్డలే నెత్తురోడుతూ కన్ను మూసినా
నువ్వు కన్న నీ కన్న బిడ్డలే నిన్ను అంగిట అమ్మివేసినా . . . !
చెరగనీవు చిరు నవ్వు మోమున ...!
నిను ఎవరు ఎంతలా హింస పరిచినా ... !
తీరిపోదు ఋణము నిన్ను ఎంతలా కొలిచినా..,
తక్కువేనేమో నీకు నా ప్రాణమర్పించినా...! ||
చెరగని నవ్వుల భారతమా ., తరగని సిరులే నీ వశమా . !
