చేతివృత్తుల చేదు బ్రతుకు
చేతివృత్తుల చేదు బ్రతుకు
ఏమైపోయాయి చేతివృత్తులు,
ఏమైపోతున్నాయి బడుగుబ్రతుకులు.
నవ నాగరీకత కాంక్షలకు బలైపోయాయి,
దుఃఖాల సుడిగుండంలో
కానరాని ప్రగతితీరంకై
ప్రార్ధనలే చేస్తున్నాయి,
మర మనసుల్లో ఇమడలేక
భారాల బ్రతుకును కన్నీళ్లకు అంకితం చేశాయి,
అలసిపోయిన జీవితయుద్ధంలో వేదనలనే చిరకాల మిత్రులంటున్నాయి,
పోరాటల ముళ్ళమార్గం
రంగులప్రపంచంలో
నీవేవరో నేనవరో చెప్పమని
వేదిస్తున్నాది,
దిక్కులేని ఆశ ఒకటి
కర్మఫలాన్ని వెక్కిరిస్తూ
కలలకు కంటిపాపకు మధ్య పోరుపెడుతున్నది.
జాలిలేని కనురెప్ప ఆశల సౌధాలు చూడనంటున్నది.
అవివేకపు తలపే
క్రీయాశక్తిని బ్రహ్మజ్ఞానంగా తలుస్తున్నది,
నిట్టూర్పులే జ్వాలాతోరణమై
ప్రకృతి చెలిమికి చితిపేర్చుతున్నది,
ఆదరణకు నోచని మాతృత్వపువాకిట
చేతివృత్తి అశాంతికి నేస్తమైనది,
సుఖములేని తలవ్రాతను
మరణ వాగ్మూలం చేస్తూ
శ్రమశక్తికి గగనపు తోవ చూపుతున్నది
