బ్రతుకు సమరం
బ్రతుకు సమరం
మానవ జీవిత సమరం
స్వార్ధంతో తాండవంచేస్తున్న ప్రళయానికి
చదువుతో వచ్చిన జ్ఞాన దీపం ఆరిపోతూనే ఉంది
ప్రకృతి వికృతి రూపం దాలిస్తూనే ఉంది
వెరసి మానవ మనుగడతో పాటుసహజసిద్దమైన వృక్ష ఖనిజ జంతు సంపదలను కూడా
ప్రమాదపు అంచుల్లోకి నెట్టబడుతూనే ఉంది
మానవ మనుగడకు ఆనవాలైనా
హరప్పా నాగరికతకు మొహంజదరో డ్రైనేజి అద్దంపట్టినట్టు చూపించినా
నియంతృత్వపోకడలకు ఆద్యుడైనా
అశోకుడి రాజ్జ్యంలో చెట్లునాటినట్టు
చెరువులు త్రవ్వినట్టు కళ్ళకుగట్టినట్టు చెప్పినా
ఏ చరిత్ర నేర్పినా నేర్చుకోని గుణపాఠం
మానవమనుగడ ప్రమాదపు కోరల్లోకి జారుతూంది
బుడమేరు పొంగిదని మున్నేరు ముంచిందని గర్జించిన ఈ లోకం
తన ఇంటిముందు డ్రైనేజి ఎక్కడా అని ప్రశ్నించుకోలేకపోయింది
పేదల పెన్నిధిలం నవనిర్మాణ రాజపోషకులం ఆని
తనకు తానుగా ఊహించుకున్న రాజనీతిజ్ఞులు
చెరువుల,నదుల దగ్గర నిర్మాణాల పాపం ఎవ్వరిది ఆని తనను తాను నిందించుకోలేకపోతుంది
వ్రేళ్ళన్నీ తనవైపుంచుకొని ఎవ్వరినినిందించి ఏమి లాభం
త్రవ్వుకున్న గోతిలో పడ్డాకా సమరం ఎవ్వరిపైనా
మానవ మనుగడ ఎందాకా....
తాటికొండాల సురేష్ బాబు
