రాఖీ పూర్ణిమ
రాఖీ పూర్ణిమ
పదేపదే కలవరింతే అనురాగమన్నది,
భయాలను కాల్చేసే శక్తే అనుబంధమన్నది,
తలపులలోని హాయిలో ఆత్మీయతున్నది,
బ్రతుకుపాట పల్లవించే మధుర గీతమే ప్రేమయన్నది,
గుండెచాటు పలుకులకు రక్షాబంధనమే రాఖీయన్నది.
పరవశాల వెల్లువలో కాలమే తెలియకున్నది,
అంతరంగ నవ్వుల్లో వ్యధలు త్రేంచు శక్తియున్నది,
ఆత్మీయ లోగిలిలో అలకముసుగే తొలిగినది,
ప్రేమ పలకరింపే అమృతధారలై మనసున నిలిచినవి,
బలహీనతలను అధిగమించే చైతన్యమే రక్షాబంధమన్నది,
ఆటపాటల మైమెరుపులతో అపురూప ఆత్మీయత సొంతమైనది,
చెరగని నగుమోమే అన్నాచెల్లి మమతలకు పసిడి సిరులైనవి,
నాకునీవు నీకునేను అనుబంధమే తేనియచెలిమై ఊరిస్తునది
సంతోషసిరులే ప్రేమలోగిలికి రంగవల్లులైనవి,
అమ్మ హృదయంలా
రక్షాబంధనమే బ్రతుకుబాటకు భాగ్యమైనది
