కనుమరుగవుతున్న తెలుగు లిపి
కనుమరుగవుతున్న తెలుగు లిపి
అందమైన అక్షరమాల నా తెలుగు లిపి
నేడు రాయడం గగనమైపోయే
ఆంగ్ల భాష మోజులో అంతమై పోయే
తెలుగులో రాయడం నేడు కష్టమయ్యే...
తెలుగు పదాలను ఆంగ్లంలో రాస్తూ
అద్భుతమైన లిపికి ఆదరణ తగ్గిందా
వేల ఏండ్ల చరిత్ర నేడు కనుమరుగవుతూ
సుందరమైన లిపి అదృశ్యమవుతుందా...
భాషకు జీవము లాంటిది లిపి
జాతి చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తూ
తరతరాలకు సంస్కృతికి అద్దంలా ఉంటూ
నేడు రాయడమే కష్టమై నిలిచింది..
అచ్చుల హల్లుల ద్వయం తొ విరాజిల్లుతూ
గుణింత వత్తులతో సుసంపన్నమై నిలిచి
గ్రంథాల్లో ముత్యాల తలంబ్రాలు మెరుస్తూ
జగతిపుటలో ఆణిముత్యమై నిలిచింది నాలిపి..
కాల గమనంలో మొనలు దేరినది లిపి
అందమైన అక్షరముగా రూపుదిద్దుకుంది
గుండ్రటి ఆకారముతో అందంగా వెలుగుతుంది
అవనిలో అద్భుత లిపిగా ప్రసిద్ధి చెందే....
తరతరాల చరిత్రకు చిహ్నంగా నిలబడే
కావ్యమై కనకమై జగతిలో కళకళలాడే
కవి చేతిలో అక్షరమై అజరామరంగా వ్యాపించే
పుస్తక పుటల్లో సుందర దృశ్యంగా కనబడుతుంది...
తెలుగు లిపి రాయడం నేడు కరిగిపోతుంది
నేటి విద్యార్థులకది దూరమై పొయే
ఆంగ్ల మధికమై మన లిపి నేడు ఆకృతి కోల్పోయే
భావితరాలకు లిపి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందా..
తెలుగు రాయమంటే మాకు రాదంటూ
శుద్ధమైన పదం రాయలేకపోతూ
నానా అవస్థలు పడుతున్న నా జాతి
ఇకనైనా మేల్కొనకపోతే నా లిపి ఒక పురాతనం..
