రాఖీ
రాఖీ
రాఖీనే కడుతున్నా..అక్షరాల దారంతో..!
వీడలేని అనుబంధపు..సుస్వరాల రాగంతో..!
పరిమళించు స్వచ్ఛమైన..కులాసాల గానంతో..!
గంధాలకు అతీతమౌ..వినోదాల హాసంతో..!
ఆత్మీయత ప్రతిఫలించు..వికాసాల మౌనంతో..!
గగనాలను దాటించే..అద్భుతాల తోరంతో..!
అమృతకరుణ వర్షించే..అభావాల హృదయంతో..!
విశ్వశాంతి రక్షాకర..సునయనాల ధ్యానంతో..!
సకలజీవ జాలానికి..ప్రమోదాల మంత్రంతో..!
పుడమితల్లి క్షేమానికి..సుతారాల స్నేహంతో..!
వేదాంతం ఒలికించే..సునాదాల తత్వంతో..!
సచైతన్య సత్వపూర్ణ..సత్ఫలాల మూలంతో..!
