చైతన్యపుశిల్పి
చైతన్యపుశిల్పి
కోటివిద్యలు నేర్చినా నిన్నునీవు తెలుసుకుంటేనే ఫలములే,
పసిడిసిరులు ఎన్నున్నా
తోటివారికి సాయపడితేనే సఫలములే.
నీలోని శోకవ్రాతను
మార్చుకొనే బ్రహ్మవు నీవేలే,
అజ్ఞానచిత్తపు
అహంకారపు దర్పణం కాంతిదీపపు ముచ్చట కాలేదులే,
భయానికే భయంవేసే
మనోబలం,ఆత్మవిశ్వాసంతో
అడుగు ముందుకేస్తే
ఓటమే ఓడి పోవులే,
సిరిసంపదల కోసమే కాదూ
జగతి చింతలు తీర్చు
ఆశయం నీదైతే
జన్మే సార్ధకమవ్వునులే.
మైత్రిపంచే మంత్రశాస్త్రపు
పేరే నీదిగా
లోకాన నువు నిలవాలిలే,
ఆనందరాగపు
అపురూప పల్లవే నీవుగా
జనుల నోట వుండాలిలే,
సత్య దారిదీపపు కథగా
చరితలోన నిలిస్తే
నీరూపమే ప్రతిహృదిలో నిలిచిపోవులే,
మాటవినని మనసుకు
నీ సదాశయ లక్ష్యమే చైతన్యపు బాట అవ్వాలిలే,
నిన్ను నీవుగా మానవతాశిల్పంగా చెక్కుకుంటే జన్మధన్యత పొందేవులే.
