ఎగురుతున్నది
ఎగురుతున్నది
ఎగురుతున్నది ఎగురుతున్నది దేశ కీర్తి విహంగం
రెప రెపలాడుతున్నది రెప రెపలాడుతున్నది మువ్వన్నెల పతాకం వినబడుచున్నది వినబడుచున్నది జాతి సమైక్యతా రాగం!
ఏ ప్రాంతమైనా ఏ మతమైనా నీకు చేసెదరు వందనం అహింస మన ఆయుధం అని గుర్తు చేయును నీ రూపం నిన్ను చూడగానే దేశభక్తితో ఉప్పొంగును హృదయం !
స్వలాభం విడిచి కర్తవ్యంకి అంకితం అవ్వాలని తెలుపును కాషాయం మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు సత్యానికి చిహ్నం శ్వేత వర్ణం మట్టితో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేయును హరిత వర్ణం!
ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈ పతాకం బానిస బతుకులకు చరమ గీతం ఈ పతాకం స్వేచ్ఛా స్వతంత్రాలకు ఆరంభం ఈ పతాకం !
సోమరితనం వదిలి ముందుకు సాగుదాం అహర్నిశలు శక్తి వంచన లేకుండా శ్రమిద్దాం దేశాభివృద్ధికి మన వంతు సహకారం అందించుదాం ! జైహింద్
