Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ఈవని రవిశంకర శర్మ

Abstract

4.5  

ఈవని రవిశంకర శర్మ

Abstract

ఉపాధ్యాయుడు !

ఉపాధ్యాయుడు !

1 min
345


ఎవరికివారు విద్యావంతులవడం కష్టమే .

అందుకు ప్రత్యేక పరిశీలన , పరిశోధన అవసరమే .

విద్యాలయాల స్థాపనలోని ఔచిత్యమదే .

ఉపాధ్యాయుడు ఆ మందిరంలో ఉండే భగవంతుడే .


విద్యలేనివాడు వింతపశువు అన్నారు .

శిక్షణ ద్వారా జంతువులతో పనిచేయించవచ్చు .

నేర్చుకున్నపుడే మనిషి ఉన్నతికి పాటుపడగలడు .

ఆ పరివర్తనను ఉపాధ్యాయుడే తేగలడు .


తల్లిదండ్రుల వలన ప్రాథమిక విషయాలు .

బడికి వెళ్ళివస్తున్నా తప్పని మెరుగులు .

మనిషిగా మార్చుటకు ప్రేమాభిమానాలు .

సజీవంగా నిలుపుటకు పేరుప్రఖ్యాతులు .


మాట్లాడుటకు , వ్రాయుటకు భాష ముఖ్యం .

ఆరోగ్యంగా జీవించుటకు పరిసరాల విజ్ఞానం .

కూడికలు , తీసివేతలు చెప్పేందుకు గణితం .

ఇంకా విధులను తెల్పేందుకు సాంఘికశాస్త్రం .


ఉపాధ్యాయులు దేశాభివృద్ధికీ సూత్రధారులు .

అంటే వైద్య , సాంకేతిక రంగాల్లోనూ సేవలు .

అలా మంచి ప్రపంచం కోసం అత్యంత కీలకం .

గుర్తించి గౌరవించడం ఎన్నడూ ప్రజల కర్తవ్యం .



Rate this content
Log in

Similar telugu poem from Abstract