STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Inspirational

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Inspirational

స్త్రీ శక్తి

స్త్రీ శక్తి

1 min
313

ఈ సువిశాల ప్రపంచం

ఇరుకుగా మారింది

పవిత్ర భారతావని

అపవిత్రమై పోయింది

సృష్టికి మూలమైన

స్త్రీ శక్తి సన్నగిల్లింది


చేవ లేకనో చావు రాకనో కాదు

మాన భీతితో

మన అనే మనిషి తో

పచ్చని మమతలు గల

సోదరభావం

ఏ కోశానా కానరాక


నీతి నియమాలు

వావి వరుసలు లేని

ఈ దుర్వినీత లోకంలో

ఎక్కడ చూసినా

అబలల ఆర్తనాదాలతో

దిక్కులన్నీ పిక్కటిల్లుతూ

ధరణి దద్దరిల్లుతుంటే

సభ్యసమాజం తలలు

దించి మౌనం వహిస్తుంటే

ఆడపిల్ల పుట్టుక

ప్రశ్నార్థకం గా మారుతుంటే


ఎన్నాళ్ళైనా ఆడదానిగానే చూసే

మృగాళ్ళ పాలిట

అసురసంహారిణివై

నీకు నీవే రక్షణగా

నీతో నీవే సైన్యంగా

కలబడు నిలబడు

ఆడపిల్ల జోలికొస్తే

తాటతీసి తోలు వలిచేలా

ప్రతిఘటించు సమరం సాగించు

ఓ ప్రాణికి జన్మనివ్వగల శక్తి నీకున్నప్పుడు

ఆ శక్తి యుక్తి లతోనే నిన్ను నీవే

రక్షించుకో నీ ఉనికిని కాపాడుకో



Rate this content
Log in

Similar telugu poem from Abstract