ఎంత బేలనైనాను
ఎంత బేలనైనాను
మాట ఒకటి అనుకున్నా
నీది కాని వేళలోన
బేలనై అశ్రు మాలలు కడుతున్నా
ఒల్లనని నువ్వన్నా
నీ మెడలో విరహ మరువాల మాలలు వేస్తున్నా
ఏ రింగుల జుట్టు చూసినా
కాస్త దళసరి మీసం చూసినా
నేవేనని పొరపడి
మళ్లీ నిన్ను కలవాలని త్వరపడి
అభాసుపాలు అవుతున్నా
కంటి కింది నల్ల చారలు
బీడు పడిన నల్ల రేగళ్ళ లాంటి నా ఆశలు
మరుసటి ఏటికన్నా గాయాలు మానిపోతాయనే బతుకుతున్నా
మల్లా మల్లా కంచాలమ్మకు మొక్కుతున్నా
ఇకనైనా నా మీద జాలి వేయట్లేదూ
చీ
ప్రేమంట ప్రేమ
పగులు ఒక మాట రేయి ఒక మాట సెప్పే ప్రేమ
అని ఆమె ఈసడించుకుంటూ కాలం గడిపింది
