భానుడి ప్రతాపం
భానుడి ప్రతాపం
ప్రచండ భానుడి కిరణాల తాకిడికి
దేదీప్య మానమై ప్రకాశించిన మండువేసవి
రోహిణి కార్తి కనుసైగలలో స్థంభించిన వాయువు
వాయు దిగ్భందనములో నిశ్శబ్దమైన వృక్షసంపద
కనికరించి రెండు పత్రములు వింజామరములైన
తోటి పత్రముల శిలా తత్వము చూచి
మరల స్థాణువులైన వైనం
వెరసి మన ఉక్కపోతల హాహాకారం.
