STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

ఎవరన్నారు నాన్న వెనకబడ్డాడ ని

ఎవరన్నారు నాన్న వెనకబడ్డాడ ని

1 min
224

ఎవరన్నారు నాన్న వెనకబడ్డాడని

తన గుండె వెనుక నన్ను దాచుకున్నాడు

నా వెనుక నిల్చొని చేయి పట్టి నడక నేర్పాడు

తన ఎదనే పాన్పు చేసి నను జోకొట్టాడు


ఎవరన్నారు నాన్న వెనకబడ్డాడని

నా వెనుక రక్షణ కవచమై నిలిచాడు

చేయి వెనుక చేయి పట్టి ఓనమాలు దిద్దించాడు

బుల్లెట్ మీద నా వెనుక కూర్చొని షికారు తిప్పాడు


ఎవరన్నారు నాన్న వెనకబడ్డాడని

నా ఊసుల వెనుక ఊకొడుతూ వినేవాడు

తన సప్తపదుల జీవన గమనములో

47 ఏళ్లు నా వెనకే తన ఆలోచనలు నా పురోగతికై


ఎవరన్నారు నాన్న వెనకబడ్డాడని

నా ప్రతీ చర్యలో నా వెన్నంటే ఉన్నాడు

ఈ లోకాన నా ఆగమనానికి వెనుక కారణమయ్యాడు

అందమైన నా జీవితానికి ఆదర్శవంతుడు



Rate this content
Log in

Similar telugu poem from Inspirational