STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

బతుకు జట్కా బండి

బతుకు జట్కా బండి

1 min
256

అంతరిక్షంలోకి శరవేగంతో దూసుకుపోతున్నా

మనిషికి పేదరికం సవాలుగానే మిగిలిపోయింది


భారంగా నడుస్తున్న బతుకుజట్కబండి

కరోనా మహమ్మారి రాకతో బీటలు వారింది


బండి చక్రాలు సవరించేంతలోనే

పెరిగిన ధరలతో బతుకు అదుపు తప్పింది


స్వార్థ రాజకీయాల  కారణంగా

అవినీతి రాజ్యమేలుతున్నది


ఉచిత పథకo  ప్రభుత్వ ఖజానాల్ని గుల్ల 

చేస్తూ కొందరిని సోమరులను చేసింది


సరైన వైద్యం అందక మహమ్మారి

ఎందరి ప్రాణాలనో బలి తీసుకుంది


ఆహార కల్తీలతో మనిషి శరీరం

మొండి రోగాలకు నిలయమైంది


నీతి నిజాయితీ కనుమరుగయి

"నాది" అన్న స్వార్థ భావన పెరిగింది


ఫలితం సామాన్యుడి జీవనం 

మరింత దుర్భరమయింది


పేదరిక నిర్మూలనతో నవ సమాజ స్థాపన

నేటి యువతకే సాధ్యం అవుతుంది


అందుకే యువత రాజకీయాలలో

చేరడం అనివార్యమయ్యింది


ఒక్క అడుగుతోనే సుదూర 

ప్రయాణం మొదలవుతుంది


లేదంటే బతుకుజట్కబండి 

ముక్కలై లోయలో పడిపోతుంది.


ఉచితాలను తిరస్కరించడమే

మార్పుకి నాంది.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational