కలం - సిరా
కలం - సిరా
కలం కినుక వహిస్తుంది
ఇప్పుడు దాన్ని ఉపయోగించట్లేదని
దానికేం తెలుసు...
ఇన్ని రోజులు కలాన్ని నా కరవాలం అనుకోలేదని
అది అక్షరాలను ఖండిస్తూ రాసిన పదాలతో
నా మనసు చీలుస్తూ రాసిన రాత గుండెకి కోత పెట్టిందని.
సిరా సిరాకు పడుతుంది
ఇప్పుడు దాన్ని ఉపయోగించట్లేదని
దానికేం తెలుసు...
ఇన్ని రోజులు సిరా నాలో దాగిన రంగుల కలలని చిత్రిస్తుందనుకున్నా
సప్తవర్ణాలను ఒలికించిన సిరా నా మనసు రుధిరాశ్రువులు చిందించిందని.
