STORYMIRROR

Praveena Monangi

Tragedy

5.0  

Praveena Monangi

Tragedy

అణచివేత

అణచివేత

1 min
382

అనాదిగా ఆడది అణచి వేయబడింది 

ఉన్నత పదవులలో కొలువుతీరినా

 రాజకీయాలలో రాణించినా

 అంతరిక్షంలో కాలు మోపినా 

స్త్రీ అణచివేయబడుతూనే ఉంది

చిన్నతనంలో తల్లిదండ్రుల ఆంక్షలతో 

యుక్తవయసులో అన్నదమ్ముల అదుపాజ్ఞలలో

వివాహానంతరం భర్త, అత్త మామ చెప్పుచేతల్లో  

వయసు పైబడిన తరువాత బిడ్డల చేతులలో 

మగువ అణచివేయబడుతూనే ఉంది 

ఎన్ని చట్టాలు రూపొందినా 

ఆగని అకృత్యాలకు బలి అవుతూ 

నేటి సమాజంలో అత్యాచారానికి గురి అవుతూ

 ఆమె అణచివేతకు గురి అవుతూనే ఉంది 

ఒక పక్క ప్రపంచం అత్యంత 

పురోగతి వైపు పరుగులు తీస్తున్నా

 మరోపక్క అర్థంలేని వివిధ ఆంక్షలతో 

నేటికీ అతివ అగచాట్లు పడుతూ 

అణచివేతకు గురి అవుతూ ఉంది.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy