STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Tragedy Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Tragedy Classics Others

"నా మదిలో మెదిలే ప్రేమ భావం!"

"నా మదిలో మెదిలే ప్రేమ భావం!"

1 min
450

నిప్పులా ప్రజ్వలిల్లి కాంతిని పంచే నా ప్రేమను,

అగ్నికి ఆహుతి చేస్తూ బూడిద చేసింది

ఈ సమాజం ...

ఆకాశమంత విశాలమైన నా ప్రేమను,

అందనంత ఎత్తులో ఉంచి అందకుండా అపహాస్యం చేసింది

ఈ సమాజం ...

ఆయువులా ఊపిరి పోసే నా ప్రేమను,

ఉప్పెనై మృత్యువులా ఆవహిస్తూ అవహేళన చేసింది

ఈ సమాజం ...

మూగబోయిన మనసులలో నిక్షిప్తమైన నా ప్రేమను,

గుడ్డిదాన్ని చేసి దారి మళ్ళిస్తూ చులకన చేసింది

ఈ సమాజం ...

చివరికి నాపై కక్ష కట్టి స్వచ్ఛమైన నా ప్రేమలో

పక్షపాతం చూపి, నన్ను పిచ్చివాడిని చేసింది

ఈ సమాజం ...

నా యదలో దాచుకున్న వెలకట్టలేని భావాలు, లెక్కలేని ఆలోచనలు తనకి చేర్చాలనున్నా..,

చేరవేయడం లో మాత్రం ప్రతిక్షణం విఫలమవుతూనే ఉన్నా...

ఆ వేదనే కాబోలు, ఉప్పొంగి అనుక్షణం ఆవేదనలా మారుతుంది.

లోకులు మాత్రం దాన్ని కోపం, ద్వేషం అంటున్నారు.

కానీ,

ఆ కోపం... ఆ ద్వేషం...

విడిపోయిన నా ప్రేమ పై కాదు,

దాన్ని విడదీసిన వారి మీద అంతకన్నా కాదు.

నా నిస్వార్థ ప్రేమని అర్థం చేసుకొని,

ఈ పనికిమాలిన ప్రపంచం అనుసరిస్తున్న పద్ధతుల మీద,

ఈ సిగ్గులేని సమాజం అనుకరిస్తున్న ఆలోచనా తీరు మీద.

ఎవరికీ అర్థకానిది..!!

తనకైనా ఇంకెప్పటికి అర్థమయ్యేనో...??

        "నా మదిలో మెదిలే ఈ ప్రేమ భావం..!"

         

                                                   -సత్య పవన్✍️



Rate this content
Log in

Similar telugu poem from Tragedy