STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy

5.0  

ARJUNAIAH NARRA

Tragedy

అంగట్లో బొమ్మ

అంగట్లో బొమ్మ

1 min
423

యవ్వనం నా ఒంటి మీదికి వచ్చిందో లేదో

నా ఆడతనం పూర్తిగా రూపుదిద్దుకుందొ లేదో బజారులోని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు  

పోకిరి కళ్లు కామంతో

నా పరికిణిలోకి తొంగి చూశాయి

నా లేత పరువాలను తడమ సాగాయి

లోకం పద్మవ్యూహం అని తెలియని వయసు ప్రేమించానని నమ్మించాడు 

పెళ్లి చేసుకుంటానని ఒప్పించాడు

మాయ మాటలతో మాయ చేశాడు 


అందరికీ నేనిప్పుడు అంగట్లో సరుకును 

బజారులో కీలుబొమ్మను

నా యవ్వనం మట్టి కొట్టుకు పోయింది 

నా సౌందర్యం శిధిలమై పోయింది 

నామెని తీయదనం లోపించింది


నన్ను బొమ్మను చేసి ఆపై అమ్మను చేసి

వ్యభిచారిని అనే వెక్కిరించే 

వాళ్ళ బిడ్డల బతుకులు 

నాలాగే అవ్వాలని శపిస్తున్న!

ఆడపిల్ల అంగట్లో బొమ్మని,

ఆ బొమ్మను నేను అవుతానని 

మీరు అనుకోలేదు కదా?  

అమ్మా! నాన్న ! నన్ను క్షమించు!

రేపటి ఉదయాన్ని చూడలేక పోతున్న .....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy