STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Tragedy

4  

ARJUNAIAH NARRA

Romance Tragedy

ఎడారి ప్రేమ యాత్ర

ఎడారి ప్రేమ యాత్ర

1 min
645

కొండల్లో పుట్టి, పీఠభూముల్లో పెరిగి

లోయలలో హొయలద్దుకొని వికసించి ప్రవహించి

ఎడారిలో ఎదురుచూస్తుంది మన ప్రేమ .......!

ఎడారి వాసులకు ఒంటె ఎంత ప్రియమైనదో 

నీవు నాకు అంతే ప్రియం అని నీకు తెలుసు కదా!


నేనె నీకు దాహాన్ని తీర్చే ప్రియమైన ఒయాసిస్ ను

ఒంటె ఎడారిలో కొన్నీ రోజులు 

నీరు తాగకుండా ఉంటదేమో కానీ 

కొన్ని క్షణాలైన నీవు లేకుండా నేను ఉండగలనా?


నీ అనుభవాన్ని నాకు చూపిస్తూ 

నాలో కొత్త కొత్త అనుభూతులు కలిగిస్తూ 

నువ్వు చేసిన ఆ ఎడారి ప్రేమ యాత్రలో 

నీకు నేను బానిసను అయ్యానుగా


ఓ గడసరి పిల్లొడా! 

అందుకే నిను తలచిన వెంటనే 

నా మనసు మారం చేస్తుంది

నీ అలికిడి వినగానే మురిసిపోతు 

మన ప్రేమను గుర్తు చేస్తుంది 


గడ్డి బీడులో గంతులు వేసిన గుర్తులు పోలె

ఇసుక డ్యూన్లో కట్టుకున్న 

పిట్ట గుళ్ళు మదిలో చేదిరిపోలే

లోయల మలుపుల్లోని

దాగుడు ముతల ఆటలు మరచిపోలే

పర్వత శిఖరం మీద పవలించిన 

జ్ఞాపకం పదిలంగానే ఉంది

జలపాతాల వద్ద జలకాలాటలు

సరస్సుల వద్ద సరసాలు నవరసాలు 

నిత్యం నూతనంగానే ఉన్నాయి


ఇసుక తుపానులో ప్రయాణిస్తున్నప్పుడు

గాలిలో లేచే దుమ్ము, ధూళి నా కంట్లో పడితే 

నీవు నీ నాలుక అద్ది తీయలేదా!

ఇసుక మైదానాలలో నీ అడుగులలో

నేను నా అడుగులేస్తూన్నప్పుడు 

నీవు ఒంటికి చలువని ఇచ్చిన

అంజీర, ఖార్జుర పండ్లని ఆరగించగానే

కాకి ఎంగిలిలా నా పెదవే కొరకలేదా!


విడిదిలో ఎడారి నృత్య ఉత్సవంలో 

ఒకరిలో ఒకరం లినమయ్యినపుడు

ఆకర్షణలుగా నిలిచింది నీవు నేనెగా

సంధ్యా సమయంలో 

లేత పసుపు, గోధుమ, నలుపు రంగుల 

ఇసుక తిన్నెలు చూస్తూన్నప్పుడు

చల్లని రాత్రిళ్లు వెచ్చదనం కోసం 

నీ బిగి కౌగిలిలో ఒదిగిపోయి 

నేను చలిమంట కాచుకోలేదా!


నీవు నా ఎడారి ఓడవు కదా

కనుచూపు మేర వెళ్లిన మార్గాన్ని 

గుర్తుంచుకుని తిరిగి నా ఒడిలోకి

తప్పకుండా వస్తావు ఎట్లాంటే

వాగులన్నాక నదుల్లో కలవాలి

నదులన్నాక సముద్రంలో కలవాల్సిందే...


అందుకే .....!

ఇసుక తిన్నెలే పూల పాన్పుగా చేసుకొని 

నీ మీద ఆశతో ఇంకా ఎన్నాళ్ళు 

ఈ ఎడారిలో వేచిచూడటం

నువ్వు ఎప్పుడు ప్రేమ యాత్రకు సిద్ధం అంటే 

అపుడు నీ ఒడిలో మల్లె తీగనై నిన్ను అల్లుకొని

అద్భుతమైన అనుభూతులను ఆహ్వానించటానికి

సరసాల సయ్యాటని ప్రారంబించటానికి

నీ కోసం ఎదురుచూస్తుంది 

నీ ఎడారి ప్రేమికురాలు...

అయితె ఈ సారి మన ప్రేమ యాత్ర

ఎడారిలో కాదు....మంచు ధ్రువాలా మీద !






Rate this content
Log in

Similar telugu poem from Romance