STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy

5.0  

ARJUNAIAH NARRA

Tragedy

మోసం, ద్వేషం, ప్రేమల రూపమె అతడ

మోసం, ద్వేషం, ప్రేమల రూపమె అతడ

1 min
503


అబద్ధం... పచ్చి అబద్ధం ....అన్ని అబద్ధం....

అతను నన్ను ప్రేమించడం అబద్ధం 

ఏడు వసంతాలు నేను మోసపోయాను 

అతని అబద్ధపు ప్రేమలో తడిసి ముద్దయ్యాను

నాకు నిజం తెలిసిన వేళ కన్నీటి సంద్రం అయ్యాను

అతని చిరునవ్వుల కోరలు చిందించిన విషం 

నా గుండెకు చేరి వొళ్ళంతా బండబారి

నా మనసు గుమ్మం ముందర వెక్కిరిస్తూ

నా మీద నాకే రోత పుట్టిస్తోంది 


అతను నన్ను తొలిసారి చూస్తుంటే ....

కళ్ళు విప్పని నా యవ్వనపు శోభ 

కొత్తగా నిండిన నా వక్ష సంపద 

నూతన అనుభవంతో నేను వణకడం 

లజ్జతో నేను ముడుచుకుపోవడం 

అపుడు నా సిగ్గు నాకే గర్వం అనిపించింది

ఎందుకంటే నాలోనే కొత్త అందాలు 

మొదటి సారి చూశాడని భ్రమ పడ్డాను 

నాలోని వేడిని చల్లార్చే అతని పెదవులు 

నాకే సొంతం అనుకున్నాను కానీ.....


శరీర వాంఛ, సౌఖ్యం తప్ప 

నిర్మలమైన ప్రేమే తెలియదు 

తెలిసుంటే మూడుముళ్ళు 

నా మెడలో వేసే మూడు ఘడియల ముందు 

మూడు ఘడియలు తన ప్రియురాలి కౌగిలిలో

ముద్దులతో తన వొళ్లంతా మెహింది అలంకారం 

నా పెళ్ళికి శ్రీకారం కాదు కదా? 


ఆ ఎంగిలి పెదిమలు 

ఆ...మెని మీద ఉన్న మురికి

ఆ ఊరి వాళ్ళ దేహాల మురికి 

ఛీ........ఛీ......... ఛీ........

అతని మీద అసహ్యం పుట్టిస్తుంది 

నీతి బంధనాలు తెంచుకొని సిగ్గు ఎగ్గు లేక 

లేత యౌవనాన్ని తాకట్టుపెట్టి 

నాకు తాళి కట్టాడు 


విధి నన్ను చూసి వెక్కిరిస్తుంది 

నా జ్ఞానం నన్ను చూసి నవ్వుతుంది

ఈ ప్రేమ లోకంలో దిక్కుమాలిన బిచ్చగత్తెను 

భార్య మీద ప్రేమ లేని భర్తకు 

సంసారం ఒక వ్యభిచారమే 

ఆరితేరి అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే 

తనలా నటించగలరని గుర్తుకొచ్చినప్పుడు 

నేను పోగేసుకున్న జ్ఞానం 

సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంది 


ఎందుకు.....

తోడుంటానని నా బతుకును నిస్సారం చేశావు 

ఒంటరిని చేసావు, క్షోభను మిగిల్చావు 

నీ అంతరాత్మకు సుబుద్ధి, సుజ్ఞానము లేదు

తాళి అర్థం తెలియని నువ్వు.........

అడవిలో తిరిగె స్వేఛ్చా చిలుకని పంజరంలో పెట్టి

సంసార గీతం పాడమంటే పాడుతుందా ? 

అని నీవు నన్ను ప్రశ్నించినపుడు 


నా మనసులో స్మశాన నిశ్శబ్దం

పులుముకొని మౌనం రాజ్యమేలుతుంది 

గుండె మూగ రోదనతో అలమటిస్తోంది

పిరికిదానిలాగా తను చేసిన పాపాన్నీ

సమాజం ఎత్తి పొడుస్తోందని భయపడలా?

ఎర్రి దానిలాగా ఏమి తెలియనట్టు నటించాలా? 

నన్ను నేను చిత్కరించుకుంటు సంసారం చెయ్యాలా?

నన్ను నేను చీదరించుకుంటూ బ్రతకాలా?

నా ప్రశ్నకు నా సమాధానం మౌనమే !

నా ప్రశ్నలకు తన సమాధానం మౌనమే !

ఈ మౌనానికి కాలమే సమాధానం చెప్పాలి!!!

అందుకే మగాడు అంటే 

మోసం, ద్వేషం, ప్రేమల రూపమె అతడు.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy