జీవన సంక్రమణం
జీవన సంక్రమణం
ఊహకే ఒణుకు పుట్టే ఉన్మదాలతో
ఒళ్ళు గగుర్పొడిచే దారుణాలతో
కాలం కత్తి విసురుతున్న వింత వైరస్ లతో
ప్రపంచం ఎరుపెక్కుతుంటే
మింగ మెతుకు సైతం గొంతుక అడ్డుపడుతుంది..
బీటలు బారిన గుండె మడి
తడి ఆరి తల్లడిల్లుతుంటే
రేగిన సెగలు భోగి మంటలయి
కడుపు మంటను పెంచుతుంటే
ఎండిన గొంతున దాహమెలా తీరుతుంది..
పనులు లేక పాచి పట్టిన పలుగుపారలు
దున్నే పొలం లేదని మూలన నక్కిన హలం
ఆరుగాలం కష్టాల బరువును మోసిన కాడెద్దులు గొబ్బెమ్మల్లా
కడుపు మాడి కదలలేకుంటే
జీవన సంక్రమణం ఏ రీతిన సాగుతుంది..
