STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance Tragedy

4  

Dinakar Reddy

Abstract Romance Tragedy

సముద్రపు కెరటాలు

సముద్రపు కెరటాలు

1 min
431

ఒక పౌర్ణమి రోజున కలిశాము

ఏదో తెలీని అనుభూతి

తెలిసే లోపే నీ చిరునవ్వుకు నన్ను బానిసను చేసింది

నీ గురించి ఇంకా తెలుసుకునే కొద్దీ 

నాలో ప్రశ్నలు పెంచింది


ఒక అమావాస్య రోజున విడిపోయాము

ఇంకేదీ తెలుసుకోకూడదు అని నిశ్చయంగా అనిపించింది

తెలుసుకున్న విషయాలకు పశ్చాత్తాపం పడాలనిపించింది

నా గురించి నాకేమీ తెలియదని

ఆ చీకటి రాత్రి వెక్కిరించింది


ఎన్నో పౌర్ణమి దినాలు 

అన్నే అమావాస్య రాత్రులు

అలా జారుకుంటూ వెళ్లిపోయాయి

నేను సముద్రపు కెరటాల్ని చూస్తూ ఉండగానే

వయసు వార్థక్యాన్ని కౌగిలించుకుంది


ఆ పున్నమి అమావాస్య ఈడి బతుకును తినేశాయి

అనే పదాలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract