STORYMIRROR

Kadambari Srinivasarao

Tragedy

5.0  

Kadambari Srinivasarao

Tragedy

చితి-చింత

చితి-చింత

1 min
546

కోర్కెలు గుర్రాలెక్కి

శరవేగంతో పరుగులు తీస్తూ..

అహం అందలం ఎక్కి

దిగిరానని మొరాయిస్తోంది


బుద్ధి రెక్కలు తొడుక్కొని

పంకిల గంధంలో దొర్లుతూ

అదే సుగంధంగా 

మైమరపు లోకంలో విహరిస్తోంది


చింతల సంద్రంలో

ఆశల సుడులలో

కొట్టుమిట్టాడుతున్న

జీవాత్మ భవ బంధాల

మోహపు దారాన్ని

పరమాత్మ పుటుక్కున తెంచేస్తే

దేహపు తిత్తి చితికి చేరి

తీరని చింతల దాహం 

చితి లోగిలిలో కాలి

ఆత్మ పరమాత్మ కౌగిలికి చేరుతుంది



Rate this content
Log in

Similar telugu poem from Tragedy