పేదరికం..
పేదరికం..
డబ్బు లేకపోవడంలోనా
ఆలోచించలేకపోవడమా
సర్దిచెప్పుకోవడమా
సమానత్వం ఆశించకపోవడమా
ఏది పేదరికం
ఈ ప్రశ్న చిత్రమైనది
పని ఉంటే పేదరికం ఉండదు అంటారు
పని కల్పించేందుకు
మాకేం పని లేదా అంటారు
శ్రమలో ఉన్న గొప్పదనం
అంతా ఇంతా కాదంటారు
ఆ శ్రమకు తగ్గ డబ్బును ఇమ్మంటే
అంతెందుకు ఇంతెందుకు అంటారు
సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తూ
అలసత్వానికి అలవాటు పడడమా
ఆకలి విలువను గుర్తుంచుకుని
కృషితో ప్రయత్నించడమా
ఏదీ పరిష్కారం
అంకెల లెక్కలు
ఎండిన డొక్కల్లో పేగుల చప్పుడును
వినిపించనిస్తాయా
పేదరికం హద్దులు దాటి
భావదారిద్ర్యాన్ని చెరిపేసే ఆలోచనలకు
కొత్త బాటలు వేయాలి
