రైతంటే..
రైతంటే..
బానే ఉంది
మళ్లీ అదే మాట
రైతంటే దేశానికి వెన్నెముక
అదే మాట చెప్పబడితివి
అదే ముచ్చట
మాట మంచిగనే ఉన్నది
మరి నువ్వేం జేసినవ్
రైతుకు బుద్ధి లేదని
ఏ పంటలు బెట్టాలో తెల్వదంటివి
ఫలానా కంపెనీ ఇత్తనాలు కొనమంటివి
మందులు కొట్టమంటివి
తీరా మారా ఇప్పుడు
ఆర్గానిక్ అనబడితివి
అదేమన్నా ఆకాశంలో పండిందా సారూ
భూమ్మీదే కదా
అది పోనీ
సరే మంచిదే
మందులు కొట్టకుండా చేస్తే
ఆరోగ్యం బాగుంటే సాలు
రైతంటే ఏంది నీ దృష్టిలో
అంతో ఇంతో ఇజ్జత్ ఇస్తవా
ఇయ్యవు
పేరుకు ఎన్నో గొప్పలు
ఎందుకు సారూ ఇదంతా
ఏ దేశంలో అయినా
కూడు తినేవాళ్ళు ఉంటే
ఆ దేశానికి అన్నదాత రైతే కదా
నువ్వు దేవుడికి పెట్టే నైవేద్యం కూడా
ఆ రైతు పండిస్తేనే కదా
మరి ఆ రైతు చేసే పనిని గౌరవించు
మాటలతో కాలం వృథా చేయక
వ్యవసాయానికి సాయం చేసి
మానవ జాతి ఉనికికి మేలు చేసుకో
డబ్బులుంటే ఏదైనా కొనుక్కుని తినొచ్చు
కానీ ఏ పంటా పండకపోతే
డబ్బులే తినలేం కదా
ఆలోచించు..