భయమెందుకంటే..
భయమెందుకంటే..
రాబందుల చూపులు
చలనం లేని శవాల గుట్టలు
రాలే ఆకుల నుండి
చిత్రమైన సంగీతం
చితి మండినట్లు గాలి వీస్తోంది
కాలిన వాసనను మోసుకొస్తోంది
చీకటి దట్టంగా కమ్ముకుని
కొవ్వొత్తులను కరగదీస్తోంది
లాంతరు పట్టుకుని
బయటకు నడిచిన అడుగులు
చెప్పులు కరిచిన చోట
మరిచిన రక్తపు మరకలు
చెట్లు నడుస్తున్నట్టు
ఆకాశం అలసినట్టు
చెమట అలైనట్టు
పక్షుల గుంపు ఒకటి మరణించినట్టు
రోజులు గడుస్తున్నాయి
అడవికి ఋతువులు తెలుస్తున్నాయి
అదే రోడ్డు
అదే ప్రయాణం
క్షణాల దూరం మారింది
అదే వ్యక్తి
వ్యసనాలు ఎన్నో
నీరసపు మానవత్వానికి
వేచి ఉన్న రాక్షసత్వానికి
వంతెన మీద ప్రయాణం కదా
భావాలు కదిపితే
భయమెందుకు అంటే
చెప్పలేని నిజాలెన్నో
చూడాల్సిన దారుణాలెన్నో..
