STORYMIRROR

Dinakar Reddy

Drama Romance

4  

Dinakar Reddy

Drama Romance

ప్రణయావేశమున

ప్రణయావేశమున

1 min
364

భావుకతకు వచ్చిన బెంగేమీ లేదు

గుప్పెడు అక్షరాలను

సారధిగా చేసి

నీ ముంగిట దాకా ప్రేమ లేఖలుగా చేర్చాను

నా అభిమానాన్ని పూల వరుసల్లో కూర్చాను


నలుగురిలో ఇష్టం లేదని చెప్పినా

నాకై వేచి ఉంటావని

నీ కళ్ళు చెప్పాయిలే


నీ పేరు తలచుకుంటూ

నా గుమ్మం ముందు తోరణాలు కట్టాను

ప్రణయావేశమున శ్రుతి చేసిన రాగాలతో

నీ రాకను స్వాగతించాను


విడుదల లేని కౌగిలి వరమీయగా

ప్రేమంటే ఏమిటని జరిగే చర్చలకు దూరంగా

నిశిలో శశిగా

నీకై నిత్యమూ ఉదయిస్తూ

నీ అధరాల చప్పుడుకు అస్తమిస్తూ

ఆసక్తిగా ఈ జీవితాన్ని

నీకంకితం చేయనీ 


కళ్ళ ముందే కలల్ని చూస్తూ

ప్రణయ సుధా గీతికగా

నీ రూపం మెదులుతోంది

నాలో కొత్త రాగం పలుకుతోంది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama