పెళ్లి కోసం..
పెళ్లి కోసం..
మ్యాట్రిమొనీ వెబ్సైట్లు
మోడ్రన్ పెళ్లిళ్ల పేరయ్యలు
ఇంట్లో పెద్దల ఇష్టాలు
అసలు ఏం ఇష్టపడాలో
ఇష్టానికి ప్రాధాన్యత ఎంతివ్వాలో
ఏదీ తెలీక కొందరు
అసలు పెళ్లికీ, ఇష్టానికీ సంబంధం లేదనీ
ఇంకేదో ప్రపంచాన్ని సృష్టిస్తూ
ముందుకు సాగేవాళ్ళూ కనిపిస్తున్నారు
బంధాలు టీవీ సీరియళ్లకి అందనివి అనీ
బాగోగులు చూడ్డం అంటే
వాట్సాప్ స్టేటస్ చూసి వదిలేయడం కాదనీ
ఇవన్నీ బుర్రకెక్కేసరికి
అసలు ఫీలింగ్స్ అంటేనే భయపడ్డం
స్వేచ్ఛ పోయిందని మొత్తుకోవడం
నూరేళ్ళ పంట అని
చెప్పడానికి కొంత మందికి భయం
తనలో సగం కాదు
ఆలోచనల్లో ఒక వంతు కూడా ఇవ్వలేని మనస్తత్వాలు
కానీ పెళ్లి కావాలి
ఓ వయసుకనో
ఓ కారణనికనో
పరమపద సోపానానికనో
ఏదో ఒక దానికి
పెళ్లి కావాలి
