ఓ తొలిప్రేమ
ఓ తొలిప్రేమ
ఏదోలా సాగిపోతున్న నా జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చావ్ ,
అతిధి అనుకునేలోపే నీ మాటలతో ముద్దొచ్చేలా చేసావ్,
చెప్పకుండానే నా హృదయంలోకి వచ్చావ్ ,
నాకే తెలియని నన్ను నాకు పరిచయం చేసావ్ ,
నీ ఆలోచనలతో ఆకట్టుకున్నావ్,
నా ఆలోచనలను నీ వైపు తిప్పుకున్నావ్
రేపు నా జీవితంలో ఎవరు ఉన్నా , నీ మీద నాకు ఉన్న ప్రేమ స్వచ్ఛం, శాశ్వతం
నా ఈ మొదటి ప్రేమ ..చివరి వరకు నా తోనే ఉంటుంది
నిన్ను నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది
ప్రేమతో
ఎప్పటికీ నీ వాడిని కాలేని
ఓ అజ్ఞాత ప్రేమికుడు

