ఓ తొలి మరు ప్రేమ
ఓ తొలి మరు ప్రేమ
ఓ మనిషి,
నాకెందుకిలా అనిపిస్తుంది ?
నీతో మాట్లాడాలని, నిన్ను చూస్తూ ఉండిపోవాలని,
నా సమయాన్ని నీకు ఇవ్వాలని,
నీ సమయాన్ని నేను తీసుకోవాలని,
నాకెందుకిలా అనిపిస్తుంది ?
నీ జీవితంలో నేను ఉండాలని,
నా జీివితంలోకి నిన్ను తెచ్చుకోవాలని,
నాకెందుకిలా అనిపిస్తుంది ?
నీ ప్రేమను పొందాలని,
నా ప్రేమను నీకు పంచాలని,
నాకెందుకిలా అనిపిస్తుంది ?
నా ఆలోచనల్లో నిన్ను బంధించాలని,
నీ ఆలోచనల్లో నేను నివసించాలని,
నాకెందుకిలా అనిపిస్తుంది ?
నా ఈ జీవితమనే ప్రయాణం నీతో కలిసి కొనసాగించాలని
నాకు తెలుసు
నీ గతంలో ఒక ప్రేమ ఉందని ,
నాకు తెలుసు
ఆ ప్రేమ జ్ఞాపకాలు నీతో ఇంకా ఉన్నాయని ,
నాకు తెలుసు
నీకు తెలియకుండానే నన్ను కన్నీళ్ళతో స్నేహం చేసేలా చేసావ్
అయినా నాకెందుకిలా అనిపిస్తుంది?

