బాల్యపు జ్ఞాపకం
బాల్యపు జ్ఞాపకం
పుస్తకాల సంచీని గొడుగులా వాడేసి
ఇంటికొచ్చి బిక్కముఖం వేయడం
పుస్తకాల అట్టల కోసం
ఆదివారం టీవీ కోసం
ఎండలో క్రికెట్ ఆడటం కోసం
చిన్న చిన్న యుద్ధాలు చేయడం
ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం కోసం
అల్లరి చేయకుండా చేసే వాగ్దానాలు
తాతయ్య చెప్పే కథలు
కంచికి చేరకముందే నిద్దరోవడం
ఊడిన పంటిని దాచడం
ఇసుకలో చికుచికుపుల్ల ఆడటం
వేసవి సెలవుల్లో ట్యూషన్లు
ఖాళీ వేళల్లో క్యారమ్ బోర్డు కుస్తీలు
స్వాతంత్ర్య దినోత్సవ పోటీలు
వ్యాసరచన కోసం కాకా పట్టడం
ప్రత్యేకంగా బాలల చిత్రాలు వీక్షించడం
దీపావళి పటాసులు
సంక్రాంతి గారెలు
బాల్యంలో జ్ఞాపకాలు ఉండాలి
చక్కని బాల్యం
పూర్తిగా చూడకముందే
ఫోన్లకు బందీ అవుతూ
ఫ్యాన్ అని ఏదో అలవాటు పడడం
వ్యక్తిత్వం లేకుండా
వంచన చేసుకునే దశకు చేరుకోవడం
ఇది కాదు భావి భారత పౌరులుగా మారడం
వికాసం వైపు విచక్షణతో
సమాజం పట్ల బాధ్యతతో
దేశం పట్ల క్రమశిక్షణతో
అడుగేసే తరాన్ని తయారు చేయాలి
బాల్యం భవితను ప్రగతిమయం చేయాలి