STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

తాబేలు ప్రయాణం

తాబేలు ప్రయాణం

1 min
347

సముద్రం కన్నా లోతైనది ఏమిటో

ఆడదాని మనస్సు 

అని కొందరంటారు

అదే కొంతమంది మనుషులంటారేమో


నేను ఈదుతూనే ఉన్నా

ఈ నాచొకటి

పైనా కిందా అన్ని చోట్లా బ్రతికేస్తుంది

నాలానే కాబోలు

నేనూ నీళ్ళల్లో భూమ్మీదా రెండు చోట్లా ఉంటాగా

గుడ్లు పెట్టేందుకు మంచి స్థలం కోసం వెతికా 


బోర్ కొట్టి

ఏదో అలా నీమో కోసం చూస్తూ

ఇలా లోపలికి వచ్చా

ఇదేంటి

ఎంత ఈదినా ఈ సముద్రం అడుగు రాదే


ఆ..

పైన ఆటుపోట్లు ఎన్ని చూపిస్తుందో

లోపల అమ్మలా ఆదరిస్తుంది

ఈ మొక్కలేవో రుచిగా ఉన్నాయ్

కాసింత తిని విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది


పైకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్పాయి చేపలు

లేకుంటే

మనుషులు వల వేసి పట్టేస్తారుట 

ఆపైన నన్నూ గాజు డబ్బాలో పెట్టేస్తారుట



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract