కుటుంబం
కుటుంబం
అప్పట్లో మేం చాలా కష్టపడ్డాం
అని చెప్పేవారూ లేరు
ఇప్పుడు పిల్లలు పడే కష్టం
గుర్తించే సమయమూ లేదు
ఆఫీసు విషయాలే ఇంటికి
ఇంటి విషయాలే ఆఫీసుకి
పక్కింటి గొడవ పక్కన పెట్టు సరే
మరి నీ ఇంటి గురించి పట్టదా
కుటుంబాలు చిన్నవైనందుకు బాధ లేదు
అవి చిధ్రం కాకూడదు
దూరంగా ఉన్న కొడుకు
పరీక్ష వ్రాస్తాడో లేదని తండ్రి
పక్క గదిలోనే ప్రైవసీ పేరిట
కూతురు ఎవరికి మెసేజ్ చేస్తోందో అని తల్లి
కేవలం అసహనాన్ని ప్రదర్శించే సమూహమా
నిజమైన ఆప్యాయతల సమ్మోహనమా
ఏది కుటుంబానికి నిజమైన అర్థం
జీవన శైలి పేరిట
దినచర్యలో యాంత్రికతను నింపుకుని
ఆన్లైన్ వ్యక్తులకు అభిమానం పంచుతూ
అదే కుటుంబం అని అనుకుంటూ
ఓ కొత్త భ్రమలో బ్రతికేస్తావా
అనురాగాల కోవెలగా
ఇంటిని మలచుకుని
కుటుంబ బంధాలు కాపాడుకుంటూ
ముందుకు అడుగేస్తావా
