క్యాలెండర్ మారిందోచ్
క్యాలెండర్ మారిందోచ్
కేకులు
అరుపులు
డాన్సులు
అన్నీ అయిపోయాయి
మళ్లీ తెల్లవారింది
అయితే క్యాలెండర్ మారిందోచ్
అన్నిటి కంటే అదే ఇప్పుడు కొత్తది
మిగతావన్నీ మామూలే
షరా మామూలే
చిరాకు మొఖాలు
చింతలు నిండిన మనసులు
పక్కింటి డాబా మీద ఆరేసిన లోదుస్తులు
ఒకర్నొకరు సావగొట్టడాలు
ఇంతేనా
ఇంతలో దానికి
కొత్త సంవత్సరం అని పేరెందుకు
ఏదో ఒకటి కొత్తది ఉండాలి
సర్లే ఏదో ఒకటి కొత్తది ఉండాలి కదా
సగటు మనిషి ఓ టీ షర్ట్ లేదా బనీన్ కొనుక్కుని
అలా ముందుకెళ్ళిపోవాలేమో
