పెంపుడు జంతువు
పెంపుడు జంతువు
ఇష్టపడ్డ బంగారు పంజరం
అందులోని చిలుకకు ఒక సంబరం
పదే పదే తన పలుకులు వింటూ
తనను గొప్ప అంటూ
తన చుట్టూ తిరిగే ఒక కుటుంబం
తన బిడ్డ కడుపు సగం నింపి
యజమానికి లీటర్ల పాలిచ్చి
ఆ ఇంటి లక్ష్మిగా వెలుగొందే
గోమాతకు ఒక వందనం
గుప్పెడు మెతుకులు పెడితే
గొప్పగ కావలి కాస్తూ
విశ్వాసం చూపించే శునకానికి
ఆ ఇల్లే ఒక సామ్రాజ్యం
అనాదిగా
పెంపుడు జంతువులైనవి
మనిషి క్రూరత్వాన్ని గ్రహించలేకపోయాయా
లేక తెలిసీ
ఇంకా మనతోనే ఉంటున్నాయా
స్వేచ్ఛను మరిచాయా
మరపించిన మనిషికి
కృతజ్ఞతను తరాల వెంబడి చూపిస్తున్నాయా
