success
success
Success
మట్టి లో
మిళితమై ఉన్న రేణువుల్లా..
కడలి లో...
కలిసియున్న నీటి బిందువుల్లా..
దేహమంతా నిండి ఉన్న..
కణజాలంలా...
నా మనసంతా..
నిండిపోయిన...నా..విజయమా!
నీ చేయిని అందుకొనేది ఎప్పుడు?
నీకై కలగనని..రాత్రి లేదు
నీకై శ్రమించని..రోజు లేదు
నిన్ను మరచిపోయే..క్షణమే..రాదు
అయినా ..
నువ్వు నీ చేయిని అందివ్వలేదు!
ఓ..విజయమా..
నీకు పక్షపాతమా?
నేత్రాలు కరువైనా..
తన మనో బలం తో..కలెక్టర్ అయ్యాడొకడు
మరి నేత్రాలున్న నేను..
బిల్లు కలెక్టర్ ని కూడా..కాలేకపోతున్నా..
కరములు లేకున్నా...
అచ్చెరువొందే చిత్రాలు
గీస్తున్నాడు..మరొకడు!
మరి..
కరములుండీ..
నా కడుపునైనా..నింపుకోలేకపోతున్నా!
కాళ్ళు లేకపోయినా...
అద్భుతంగా...నాట్యమాడేవడు ఒకడు
మరి..
రెండు కాళ్ళూ దిట్టంగా ఉన్నా..
నే..బతుకు బాటలో...
ముందుకు సాగాలేక చతికలు పడుతున్న!
ఎందుకు విజయమా!
నాపై ఇంత కక్ష?
ఓ...
వారిలో ఉన్న..
మనో బలం నాలో లేదు
సాధించాలన్న తపన నాలో లేదు
వారిలో ఉన్న...
పట్టుదల నాలో లేదు
హే ...భగవాన్!
నాకు అన్నీ... ఇచ్చి
ఎందుకు నన్ను సోమరిని చేశావ్
అన్నీ ఇచ్చావు కదా...
నాకేమీ అనుకున్నా...
కానీ!
అన్నిటితో పాటు..
మనో వైకల్యాన్ని కూడా... ఇచ్చి
నిజమైన.. వైకల్యుడ్ని....చేశావు!
......రాజ్ ....
