తరుణమిదే
తరుణమిదే
విశ్వశాంతి యజ్ఞంలో..ఉండాల్సిన తరుణమిదే..!
మారణాయుధాలన్నీ..మరవాల్సిన తరుణమిదే..!
సరిహద్దుల రక్షణలో..మునిగేనా భవితవ్యం..
దుర్మార్గపు ఘాతుకాలు..ఆపాల్సిన తరుణమిదే..!
అర్థరహిత తీవ్రవాద..మూకలనిక మూసేద్దాం..
ఉపేక్షించు విధానమది..వీడాల్సిన తరుణమిదే..!
హింసకు ప్రతిహింసతోటి..జవాబెంత దారుణమో..
సరియగు సోదర భావం..పొంగాల్సిన తరుణమిదే..!
సంయమనం పాటించగ..సహనమెంతొ కావాలోయ్..
ప్రతీకార వాంఛలన్ని..రాలాల్సిన తరుణమిదే..!
కలాల గళాలు చిందే..అక్షరాల రుధిరమేది..
నరమేధం నిరసించగ..నిలవాల్సిన తరుణమిదే..!
