చలి నా నెచ్చెలి
చలి నా నెచ్చెలి
అంశం ; చలి( కవిత )
శీర్షిక ; చలి,నా నెచ్చెలి
******************
చలి, చెలిలా నన్ను చుట్టేసింది వెచ్చని కౌగిలిలో కరిగిపోయేలా.
చలి, వెన్నెల విహారంలా సాగుతుంది ఊసులతో ఊరిస్తున్న ప్రేయసిలా.
చలి,చలిగాలి పిల్లగాలిలా తగులుతుంది
అల్లరి యవ్వనం తొంగి చూసేలా.
చలి,అందం ఊగిసలాడుతుంది
అధరసంతకం అరవిరిసేలా.
చలి,మనసు లోతులోని అనురాగం
నిద్ర లేపుతుంది
సజీవ అనుభూతి పరవశం చిలికేలా.
చలి,తొలకరి పరువం మనసులో కురుస్తుంది పలకరింపుల పరిమళం రుచి చూసేలా.
చలి ,కస్సుబుస్సుమంటూ కోపం చూపుతుంది
తహతలాడే తాపం కసిరేపేలా.
చలి,దుప్పటి కప్పుకొని
చెలి చెంత చేరితే హాయి.
తరగని రేయిలో
సమ్మోహన సన్నాయి.
రచన
కనక
