STORYMIRROR

KANAKA ✍️

Classics Inspirational

4  

KANAKA ✍️

Classics Inspirational

నా విజయం నీ తోడుగా

నా విజయం నీ తోడుగా

1 min
212

జీవితం పంచిన విస్తరిలో 

షడ్రుచుల సమ్మేళనంతో,

నా విజయం,నీ తోడుగా

గత సంవత్సరానికి శుభం పలికింది.


సంవత్సరం మొదలు నూతన 

మనోహర స్నేహంతో,

అనుకోని ప్రయాణం 

అలిపే లేని ప్రపంచంగా 

మారి నా నీడగా నడిచింది.


మనోహరంలో కవన కడలి కెరటాలతో, నవమోహన లిపి కథల సోయగంతో 

ఆత్మీయ సమీక్షలతో, చల్లని పలకరింపులతో 

ఆనందం పంచుతూ అద్భుతంగా సాగింది.


సంసార సాగరాన్ని అలకలు ,కులుకులు, మౌనరాగాలు, సరస సల్లాపాల, 

సరాగాలు హోయలపోతూ 

ఊరిస్తూ సాగింది .


నా అక్షరముకి తోడుగా బంధంగా 

అచ్చు అయి ఆనందం పంచింది.

అక్షరం తెలియని ఆలోచనలు ,అచ్చు పుస్తకాలుగా మారి ముంగిట నిలిచింది.


కవితాగానం, కథాగానం మధురిమలో 

సన్మానాలు, శాలువాలు, ప్రశంసాపత్రాలు

జల్లులు కురిపిస్తూ ప్రశంసించింది.


బుడిబుడి అల్లరి పిల్లల పర్ణశాల 

అయింది ఎన్నో ప్రయోగాల పాఠశాల

అల్లరి ఆటలు ,సరదా పాఠాలు 

నా స్కూల్లో పిల్లల కేరింతలు.


నా విజయానికి తోడుగా నిలిచి,

నా మనసులో ముద్రితం అయిన సంవత్సరమా,నీకిదే నా అక్షర నీరాజనం.


మరెన్నో విజయాలు నా సాహిత్య వనంలో

అరవిరియాలని ,మనోహర సుమాలు  

నీ నూతన సంవత్సరము కానుకగా అందించుమా మిత్రమా .

*****************

రచన 

కనక


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics