STORYMIRROR

KANAKA ✍️

Classics Inspirational

4  

KANAKA ✍️

Classics Inspirational

ఇదేం మాయ శివయ్య

ఇదేం మాయ శివయ్య

1 min
253

అనంతం అద్భుతం 

నా తరమా నిను వర్ణించడం

అమోఘం అతి మధురం 

కాలాతీతం కారణజన్మం

ఇది ఏం మాయ శివయ్య 

నీ మాయలో పడేసావయ్యా.


నే ఆపలేని దుఃఖాన్ని 

నీ స్పర్శ అనుభూతి కలిగించి 

నా కన్నీరు తుడిచి 

నీ అక్కున చేర్చుకున్నావు.

ఇదేం మాయ శివయ్య 

నీ మాయలో పడేసావయ్యా..


గుండె తెగిన వాగులా 

కన్నీటి అభిషేకం చేస్తే 

పన్నీరు కురిపించి 

కార్తీక పౌర్ణిమి వెన్నెలలో 

పల్లకి మోయించావు

నీ పాటలు పాడించావు

ఇదేం మాయ శివయ్య

నీ మాయలో పడేసావయ్య .


ఆనంద డోలికలు 

నా సొంతం చేసిన నీకు 

ఏమి ఇవ్వగలను 

నా దేహ భస్మంతో అభిషేకం తప్ప 

నా జీవం నిన్ను చేరే మార్గం 

వెతకడం తప్ప 

ఇదేం మాయ శివయ్య 

నీ మాయలో పడేసావయ్యా..


Rate this content
Log in

Similar telugu poem from Classics